అనూప్ కు సినిమా ఆఫర్స్ తగ్గడానికి కారణం అదేనా...?

murali krishna
అదిరి పోయే మ్యూజిక్ తో వరుసగా క్రేజీ ఆఫర్స్ కొట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ మధ్య అసలు ఏ సినిమాలోనూ అంతగా కనిపించడం లేదు. ఒకప్పుడు వరుసగా ప్రేమ కావాలి,ఇష్క్ మరియు గుండెజారి గల్లంతయ్యిందే, మనం, టెంపర్ అలాగే గోపాల గోపాల లాంటి వరుస సక్సెస్ లు కొట్టి  టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన అనూప్ చేతిలో ప్రస్తుతం ఒక్క పెద్ద సినిమా కూడా లేదని చెప్పవచ్చు.ఆయనని పెద్ద సినిమాలకి  అస్సలు తీసుకోవట్లేదటా
ఆయన్ని పెద్ద దర్శకులు అస్సలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఆయన నిన్న మొన్నటిదాకా చాలా చిన్న సినిమాలు చేస్తూ చాలా  క్వాలిటీ మ్యూజిక్ ను అందించడంతో ఆయన మన పెద్ద సినిమాలకి పనికి రాడు అని అందరికీ ఒక నమ్మకం అయితే వచ్చేసింది. అయితే ఆయనకి ఒక మంచి సినిమా పడితే తన మ్యూజిక్ సత్తా ఏంటో నిరూపించుకొని మళ్ళీ పెద్ద సినిమాలకి పెద్ద హీరోలకి మ్యూజిక్ చేయాలని ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు...అప్పట్లో ఆయన్ని పవన్ కళ్యాణ్, నాగార్జున కూడా ఎంతగానో ఎంకరేజ్ చేశారు ఇండస్ట్రీ లో ఎంత టాలెంట్ ఉన్న కానీ సక్సస్ ఉంటేనే వాళ్ళకి అస్సలు వాల్యూ ఇస్తారు లేకపోతే ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు.
అది హీరో అయిన, మ్యూజిక్ డైరెక్టర్ అయిన అలాగే సినిమా డైరెక్టర్ అయిన ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అన్న ఎదుటి వాడు మనం మాట్లాడేది వినాలి అన్న మన దగ్గర సక్సెస్ అయితే ఉండాలి లేకపోతే ఎవ్వరూ కూడా అస్సలు లెక్క చేయరు.అలాగే అనూప్ తన టాలెంట్ ని ఉపయోగించి పెద్ద సినిమా ఆఫర్స్ ను కొట్టేయాలని చూస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం సినిమాతో అనూప్ మ్యూజిక్ ను నాగార్జున ఎంతగానో మెచ్చుకున్నారు. వరుస సినిమాలకు ఛాన్సులు కూడా అనూప్ కు ఇచ్చారు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: