బాలకృష్ణ ఆఖరి 5 మూవీల కలెక్షన్స్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ఆఖరిగా నటించిన 5 మూవీ ల ఫైనల్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
వీర సింహా రెడ్డి : బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి గోపీచంద్ మరియు దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 79.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ విలన్ పాత్రలలో నటించారు.
అఖండ : బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి 75.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.
రూలర్ : బాలకృష్ణ హీరో గా కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి 10.05 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
ఎన్టీఆర్ పార్ట్ 2 : బాలకృష్ణ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి  3.78 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఎన్టీఆర్ పార్ట్ 1 : బాలకృష్ణ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 20.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
బాలకృష్ణ ఆఖరుగా నటించిన 5 సినిమాల కలెక్షన్ ల వివరాలు ఇవే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: