పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..!

Divya
లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనిపించుకుంది కానీ దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ తన నటనతో , అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. తాజాగా ఈమె పులి మేక అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది దీనికి మంచి స్పందన రావడంతో అందరూ కూడా ఈ వెబ్ సిరీస్ చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు లావణ్య త్రిపాఠి కి కూడా ఈ వెబ్ సిరీస్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందడంలో సందేహం లేదు.
ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.. పెళ్లి చేసుకోవాల్సిన సమయం  వస్తే కచ్చితంగా నేనే మీకు చెబుతాను అయితే పెళ్లి విషయంలో నేను మాత్రం చాలా అదృష్టవంతురాలని.. వాస్తవానికి మా పేరెంట్స్ నన్ను పెళ్లి చేసుకో అని ఇబ్బంది పెట్టడం లేదు.. అయితే మీ ఉద్దేశం ప్రకారం ఇండస్ట్రీలో 10 సంవత్సరాల పాటు హీరోయిన్గా రాణిస్తే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఆమె తెలిపింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఆలోచనలు ఇప్పుడు లేవు నా దృష్టి మొత్తం సినిమాల పైనే ఉంది కాబట్టి నేను సక్సెస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ నేను పెళ్లి చేసుకునే టైం సడన్గా వస్తే మాత్రం కచ్చితంగా మీతో చెప్పే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది.
అంతే కాదు తాను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా మనసుకు నచ్చి.. మనల్ని ప్రేమించే వ్యక్తి కావాలి అని తెలుపుతోంది.  ఒకవేళ అలాంటి మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే అతనితో ఏడడుగులు వేయడానికి ఎటువంటి అభ్యంతరం కూడా లేదని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే వరుణ్ తేజ్ తో పెళ్లి విషయంపై ఆమె నోరు విప్పలేదు కానీ ప్రస్తుతానికైతే పెళ్లి వార్తలపై నోరు విప్పి అలా క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: