చరణ్ జూనియర్ లను సస్పెన్స్ లో పెట్టిన ఆస్కార్ నిర్వాహకులు !

Seetha Sailaja
ఈనెల 12న ఆస్కార్ అవార్డ్స్ వేడుక అత్యంత ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకలో ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ కాబడ్డ ‘నాటు నాటు’ పాటకు ఖచ్చితంగా అవార్డు వచ్చి తీరుతుందని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు అంచనాలలో ఉన్నారు. ఈ వేడుకకు ఇప్పటికే అమెరికాలో ఉన్న రామ్ చరణ్ రాజమౌళి కీరవాణి లతో పాటు జతగా జూనియర్ కూడ అమెరికా ప్రయాణం అవుతున్నాడు.
 
 
ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ఆస్కార్ అవార్డు వేదిక పై రామ్ చరణ్ జూనియర్ లతో ‘నాటు నాటు’ పాట లైవ్ పెర్ఫామెన్స్ చేయించాలని రాజమౌళి చాల గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆస్కార్ అకాడమి ఈ సాంగ్ కు సంబంధించి లైవ్ పెర్ఫామెన్స్ వేదిక పై ఉంటుందని చెపుతూ ఇప్పటికే ఈ పాటను లైవ్ లో పాడవలసిందిగా రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవను పిలిపించవలసిందిగా అకాడమీ నిర్వాహకులు జక్కన్నకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.
 
 
అయితే చరణ్ జూనియర్ లతో ఆస్కార్ అవార్డుల వేదిక పై లైవ్ పెర్ఫామెన్స్ ఇప్పించే విషయమై ఇంకా ఈఅవార్డుల కమెటీ తుదినిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు. అంతేకాదు ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో పాటల లైవ్ పెర్ఫామెన్స్ ఉంటుంది కాని ఇప్పటివరకు నటీనటుల చేత లైవ్ పెర్ఫామెన్స్ ఇప్పించిన సందర్భాలు చాల అరుదుగా ఉండటంతో చరణ్ జూనియర్ ల లైవ్ పెర్ఫామెన్స్ ఆస్కార్ అవార్డుల వేదిక పై ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
 
 
రాజమౌళి రాయబారాలు ఫలించి ఆస్కార్ వేదిక పై చరణ్ జూనియర్ లు ‘నాటు నాటు’ పాటకు లైవ్ లో స్టెప్స్ వేస్తే తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు మాత్రమే కాకుండా దేశంలోని చాలామంది ఆస్కార్ అవార్డుల ఈవెంట్ ను టివీలలో చాల ఆశక్తిగా చూసే ఆస్కారం ఉంది. ఇప్పటివరకు తెలుగు హీరోలు ఎవరు ఆస్కార్ అవార్డు వేదిక పై సందడి చేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఆ అదృష్టం చరణ్ జూనియర్ లకు దక్కబోతోంది అనుకోవాలి..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: