ట్రోల్స్ ప్రభావం.. దిల్ రాజు ఫన్నీ రియాక్షన్..!

shami
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తను నిర్మించిన వారిసు సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన తమిళ స్పీచ్ వైరల్ గా మారింది. వచ్చీ రాని తమిళ్ తో దిల్ రాజు స్పీచ్ తెలుగు ట్రోలర్స్ కి మంచి స్టఫ్ గా మారింది. ఇక ఆ స్పీచ్ గురించి మీమ్స్ అయితే భారీగా వచ్చాయి. తన స్పీచ్ పై వచ్చిన ఈ ట్రోల్స్, మీమ్స్ గురించి తెలుసుకున్న దిల్ రాజు దానిపై సీరియస్ అవకుండా ఫన్నీ గా రియాక్ట్ అయ్యాడు. అదికూడా తన బ్యానర్ లో కూతురు నిర్మించిన బలగం సినిమా ఈవెంట్ లో మళ్లీ అదే తమిళ స్పీచ్ తో అలరించారు దిల్ రాజు. సో ట్రోల్స్ తన దాకా చేరాయని చెప్పడానికి ఇది ఒక ఉదహరణ.
బలగం సినిమా ఈవెంట్ లో ఆయన మాట్లాడినదంతా మాట్లాడి చివరగా సినిమా గురించి తమిళంలో ఇరుక్కు.. ఇరుక్కు అంటూ చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. ట్రోల్స్ ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో సెలబ్రిటీస్ కి బాగా తెలుసు. తన మీద వచ్చిన ఈ ట్రోల్స్ ని దిల్ రాజు ఇలా చాలా పాజిటివ్ గా తీసుకోవడం మాత్రం మెచ్చుకోదగిన అంశమే. ఈమధ్య ఆయన్ను ఇమిటేట్ చేస్తూ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ కూడా తమిళంలో మాట్లాడే సాహసం చేశారు. కానీ ఇదంతా దిల్ రాజుని టార్గెట్ చేయడమే అని అనుకున్నారు.
ఫైనల్ గా దిల్ రాజు బలగం సినిమాను ప్రేక్షకులకు చేరువేయడంలో తన టాలెంట్ చూపిస్తున్నారు. కమెడియన్ వేణు వెల్దండి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో ఒక ఎమోషనల్ సినిమాగా తెరకెక్కించారు. సినిమా ఆల్రెడీ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ప్రేక్షకుల నుంచి కూడా అదే రెస్పాన్స్ తెచ్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: