బాబు కూడా సిద్ధమవుతున్నాడుగా..!

shami
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ పిక్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. బాబు జిం లుక్ లో కనిపించడం చాలా అరుదు. కానీ లేటెస్ట్ పిక్ జిం లో తన ఫిట్ నెస్ బాడీనికి చూపిస్తూ ఫోటోలు రిలీజ్ చేశారు. ఏమాటకామాట కటౌట్ మాత్రం అదిరిపోయింది. ఇది త్రివిక్రం సినిమా కోసం కష్టపడుతున్నట్టుగా చెబుతున్నారు కానీ రాబోయే రాజమౌళి సినిమా కోసం కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మహేష్ ఎప్పుడు తన కెరీర్ లో లుక్స్ విషయంలో గాబరాపడింది లేదు. కానీ పెరుగుతున్న కాంపిటీషన్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎవరికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు అందుకే జిం వర్క్ అవుట్స్ తో పర్ఫెక్ట్ లుక్ తో కనిపిస్తున్నాడు మహేష్.
త్రివిక్రం సినిమా పూర్తి చేసి ఆ వెంటనే రాజమౌళి సినిమాకు రెడీ కానున్నాడు మహేష్. ఈ ఏడాది మిడిల్ లో రాజమౌళి మహేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. 2025 సమ్మర్ కానీ ఎండింగ్ లో కానీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి సినిమా అంటే హీరోలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకు తగినట్టుగా తనకు తాను సిద్ధం చేసుకుంటున్నాడు మహేష్. త్రివిక్రం సినిమా పూర్తయ్యే లోగా తన కొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ తన ఛార్మింగ్ లుక్స్ తో హాలీవుడ్ స్టార్స్ కి పోటీ ఇస్తుంటే. ఇక రాజమౌళి సినిమాతో హాలీవుడ్ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పొచ్చు.
త్రివిక్రం సినిమాలో మహేష్ ఫ్యామిలీ మెన్ గా కనిపించనున్నారు. అయినా సరే తన కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రం తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్న మహేష్ ఈ సినిమాతో ఆ కాంబో స్టామినా ప్రూవ్ చేయబోతున్నారని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ 150 కోట్ల దాకా ఉంటుందని టాక్. మహేష్ బాబు త్రివిక్రం కలిసి బ్లాక్ బస్టర్ కొడితే ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి ఈ సినిమా రెడీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: