పవన్ కళ్యాణ్ క్రేజీ మూవీలో బ్రహ్మానందం..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ ... సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతం రీమేక్ మూవీ లో నటించడానికి ... హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో నటించడానికి ... సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ మూడు మూవీ లలో సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోయే వినోదయ సీతం రీమేక్ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ రీమేక్ మూవీ లో అనేక మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ మూవీ ఒరిజినల్ లో ఎలాంటి పాటలు లేనప్పటికీ తెలుగు రీమిక్ లో మాత్రం రెండు పాటలను పెట్టే విధంగా కథలో మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ... బ్రహ్మానందం పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు ... బ్రహ్మానందం కు సంబంధించిన సీన్ లు కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ లో బ్రహ్మానందం నటించే అవకాశాలు ఉన్నాయి అని తెలియడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: