చీర కట్టులో మెరిసిపోతున్న అనుపమ..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలం లో వరుస సినిమా అవకాశాలతో అదిరిపోయే రేంజ్ లో జోష్ చూపిస్తున్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అనుపమ పోయిన సంవత్సరం అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. అలాగే నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించింది.
 

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం అనుపమ నటించిన మూవీ లలో కార్తికేయ 2 మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు లభించింది. అనుపమ ఆఖరుగా నిఖిల్ హీరో గా రూపొందినటు వంటి 18 పేజెస్ అనే మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని ప్రస్తుతం ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న అనుపమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అనుపమ అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ తెచ్చింది. ప్రస్తుతం అనుపమ కు సంబంధించిన ఈ చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: