విజయ్... గౌతమ్ మూవీలో కూడా ఆ ముద్దుగుమ్మే హీరోయిన్..?

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఈ యువ కథానాయకుడు అర్జున్ రెడ్డి ... గీత గోవిందం ... టాక్సీ వాలా మూవీల విజయాలతో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ కొంత కాలం క్రితమే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ ద్వారా విజయ్ దేవరకొండ తన అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులను కూడా భారీ లెవల్లో నిరుత్సాహ పరిచాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ శివా నర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

సమంత ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత విజయ్ ... గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 12 వ మూవీ గా రూపొందబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ.లో హీరోయిన్ గా శ్రీ లీల నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కథను శ్రీ లీల కు వినిపించగా ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: