తెలుగు సినిమాలకు సమంత దూరం.. కారణం అదేనా..?
అయితే సమంత మాత్రం తన పూర్తి ఫోకస్ బాలీవుడ్ మీద పెట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. తెలుగు సినిమాల్లో చేయడం వల్ల ఇక్కడ మీడియా తనని అనవసరమైన ప్రశ్నలతో డిస్టర్బ్ చేస్తుందని.. అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే కొన్నాళ్లు తెలుగు సినిమాలు చేయకుండా ఉంటే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చిందట సమంత. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అది ఎందువల్లా అన్నది తెలియదు కానీ అలా జరిగింది.
అందుకే ఇక మీదట మీడియా అడితే రొటీన్ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేకనే ముంబైకి మకాం మార్చాలని చూస్తుందట. అందుకే ఖుషి తర్వాత ఏ ఒక్క తెలుగు సినిమాకు సమంత సైన్ చేయలేదు. మొత్తానికి సమంత ఒక డెశిషన్ కి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఖుషి సినిమా హిట్టైతే ఆమెకు ఇక్కడ నుంచి ఛాన్స్ లు వస్తాయి. ముందు తన ప్రియారిటీ టాలీవుడ్ కే అని చెప్పింది కాబట్టి ఇక్కడ సినిమాలు చేస్తుంది. సో సమంత దూరంగా వెళ్ళాలని అనుకున్నా ఇక్కడ ఆమె ఫ్యాన్స్ ఆమెని వెళ్లనివ్వరని అర్ధమవుతుంది. పూర్తిగా కాకపోయినా కేవలం సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే తెలుగులో చేయాలని అనుకుంటుందట సమంత. సమంత నిర్ణయానికి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నా ఆమె మాత్రం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అనుకుంటుంది.