రవితేజ రావణాసుర రిలీజ్ డేట్ లాక్..!

Divya
మాస్ మహారాజా రవితేజ గత ఏడాది డిసెంబర్లో ధమాకా సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ అందుకున్న విషయం తెలిసిందే. 2022 కి ఆయన మంచి ముగింపు కూడా పలికాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలసి వాల్తేరు వీరయ్య సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం రావణాసుర .. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వడంతో చిత్ర బృందం విడుదల తేదీని కూడా ప్రకటించింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.
ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటిస్తూ చిత్రాన్ని ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరొకవైపు రావణాసుర నాన్ థియేట్రికల్ కూడా భారీగా బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ Zee 5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది స్ట్రీమింగ్ రైట్స్ దాదాపుగా రూ. 12 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా జీ తెలుగు సొంతం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా హిట్టు పడుతుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు.  ఇక ఇందులో హీరోయిన్లుగా అను ఇమ్మానుయేల్, పూజిత పొన్నాడ,  దక్ష నగర్కర్ , మేఘ ఆకాష్ లు నటిస్తున్నారు. సుశాంత్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు.  ముఖ్యపాత్రలో మురళీ శర్మ, నితిన్ మెహతా, రావు రమేష్ , సంపత్ రాజు తదితరులు భారీ తారాగణం ఈ సినిమాలో భాగం పంచుకుంటున్నారు అభిషేక్ పిక్చర్స్ ఆర్టీ టీం వర్క్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసి రోలియో , హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ కొత్త ఏడాది ఆయన విడుదల చేయబోతున్న రెండో సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: