రామ్ చరణ్ ని చూసి కుళ్ళకుంటున్న ఇతర హీరోలు...!!

murali krishna
రామ్ చరణ్ అమెరికా పర్యటన లో చాలా బిజీగా ఉన్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ప్రజెంటర్గా పాల్గొనేందుకు ఆహ్వానం రావడం తో ఆయన అమెరికాలో ఆయన సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్కు ఆయన వెళ్లాడు. అక్కడి పాపులర్ మీడియా ఏబీసీ మరియు గుడ్ మార్నింగ్ అమెరికా వంటి షోలో పాల్గొన్నాడు. ఇలా ఈ షోలలో పాల్గొన్న తొలి ఇండియన్ హీరోగా రామ్ చరణ్ రికార్డుల ను క్రియేట్ చేశాడు. ఇలా చరణ్ దక్కిన గౌరవం పై ఒక్క టాలీ వుడ్ హీరో కూడా ఇప్పటివరకు అస్సలు స్పందించలేదు.
ఇక రామ్ చరణ్ కి దక్కిన ఈ గౌరవం పై టాలీవుడ్ హీరోలు ఏమాత్రం కూడా స్పందించకపోవడం తో ఈయనకు దక్కిన గౌరవం పట్ల హీరోల కు జలసీగా మారిందా? అందుకే టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ విషయంలో మౌనం వహిస్తున్నారా అనే సందేహాలు అయితే వక్త్యం అవుతున్నాయి.విచిత్రంగా మన తెలుగు హీరోల్లోంచి ఏ ఒక్కరు కూడా రామ్ చరణ్ కు కంగ్రాట్స్ చెప్పటం లేదు. అయితే రామ్ చరణ్ కి దక్కిన ఈ గౌరవం పై మెగా హీరోలు ఒక్కొక్కరు స్పందిస్తూ రిప్లై కూడా ఇస్తున్నారు. ఇక చరణ్ కు దక్కిన ఈ గౌరవం గురించి కనీసం అల్లు ఫ్యామిలీ నుంచి కానీ, మహేష్ బాబు ప్రభాస్ వంటి వారు కూడా స్పందించకపోవడం విశేషం.. బెస్ట్ యాక్టర్స్ లిస్ట్లో బ్రాడ్ పిట్ మరియు టామ్ క్రూజ్ వంటి వారి పేర్ల సరసనా రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ పేర్లు కూడా నామినేషన్లో కనిపించాయటా.. ఇలా ఒక తెలుగు హీరోల పేర్లు అంతర్జాతీయ వేదిక పై కనిపించడం తో ఇది తెలుగువారు ఇండియన్ సినీ సెలబ్రిటీలు ఎంతో గర్వించాల్సిన విషయం గా చెప్పొచ్చు.చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున అయితే కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: