ఆ తేదీ నుండి "ఖుషి" మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయిన సమంత హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా ముగిసింది.

కాకపోతే కొంత కాలం నుండి ఈ మూవీ షూటింగ్ అనుకున్న రీతిలో జరగడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ కి సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్ ను ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ లో 27 మరియు 28వ తేదీలలో ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిన్న షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ మూవీ కి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ను మార్చ్ 8 వ తేదీ నుండి జరపడానికి మూవీ యూనిట్ సిద్ధం అయినట్లు ... ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ మరియు సమంత కూడా ఉండబోతున్నట్లు ... వీరిద్దరిపై ఈ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో మహానటి మూవీ తెరకెక్కింది. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: