ఇండస్ట్రీలో ఎదగడానికి ఆయన ముందు తల వంచిన చిరంజీవి..!!

murali krishna
చిరంజీవి సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో విలన్ వేషాలు వేస్తూ చిన్న క్యారెక్టర్స్ చేసేవారు..అప్పటికే ఎన్టీయార్, నాగేశ్వర రావు, కృష్ణ మరియు శోభన్ బాబు లాంటి హీరోలు టాప్ పొజిషన్ లో అయితే ఉండేవారు.అలాంటి టైములో చిరంజీవి వేసే వేషాలకి అంత గుర్తింపు అయితే ఉండేది కాదు కొన్ని మంచి క్యారెక్టర్స్ చేసిన కూడా అవి తరువాత అవకాశాలని తెప్పించే క్యారెక్టర్స్ అయితే కాదు.దాంతో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఎదుగుతున్న టైములో అప్పటికే పరిశ్రమ లో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న అల్లు రామలింగయ్య తన కూతురిని చిరంజీవి కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకొని చిరంజీవి ని అడిగి ఒప్పించి పెళ్లి చేసారటా.అలా చిరంజీవి సురేఖ గా ర్ల పెళ్లి అయితే జరిగింది.ఇక అప్పటి నుంచి చిరంజీవి ని మంచి హీరోగా చేయడానికి అల్లు రామలింగయ్య కూడా ఎంతో కష్టపడ్డారు.
ఇక అదే టైములో ఎన్టీయార్ కొడుకు అయినా బాలకృష్ణ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి సినిమాలు చేస్తున్నారు..సరిగ్గా అదే టైం కి అల్లు రామలింగయ్య చిరంజీవి తో నువ్వు రోజు రామారావు గారు కనపడగానే నమస్కారం పెట్టు అని చెప్పేవాడట.చిరంజీవి అప్పట్లో రామారావు గారి ఇంటి పక్కనే ఉండేవారటా.దాంతో అయన వచ్చేటపుడు, పోయేటప్పుడు ఎప్పుడూ నమస్కారం పెట్టేవారట.రామలింగయ్య గారు అలా ఎందుకు చేయమన్నారంటే,అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో చిరంజీవి ఎదుగుతున్నాడు కనుక రామారావు గారి కొడుకు అయినా బాలకృష్ణ కూడా అప్పుడప్పుడే మంచి హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి చిరంజీవి తన కొడుకు ఎదుగుదలకి ఎక్కడ అడ్డు పడతాడో అనే ఉదేశ్యం తో రామారావు గారు చిరంజీవిని తొక్కేస్తాడేమో అని అనుకొని అల్లు రామలింగయ్య ఆలా ఎన్టీయార్ గారికి రోజు నమస్కారం పెట్టమని చెప్పారని సమాచారం.అలా చేస్తే ఇతను కూడా మనవాడే అనే ఫిలింగ్ రామారావు గారికి కలుగుతుందని చెప్పేవారట.…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: