ఈ సూపర్ స్టార్ కి ఏమైంది..!!

Divya
అక్షయ్ కుమార్ భారత దేశంలోని అత్యధిక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటలలో ఒకరని చెప్పవచ్చు. గత నాలుగేళ్లుగా అసాధారణమైన విజయాలతో అజయాత్ర కొనసాగించిన అక్షయ్ కుమార్ వరుసగా హిట్టు మీద హిట్టు కొట్టి చరిత్ర సృష్టించాడు. కానీ ఏడాదికాలంగా అక్షయ్ కుమార్ వరుసగా డిజాస్టర్లు మూటగట్టుకుంటున్నారు. 2002లో విడుదలైన భారీ చిత్రాలు పృథ్వీరాజ్ సామ్రాట్, బచ్చన్ పాండే, రామ్ సేతు, రక్షాబంధన్ వంటి భారీ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించడంలో అక్షయ్ కుమార్ చాలా వెనుక పడ్డాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఏడాదైనా అతడికి సరైన అవకాశం వస్తుందని భావిస్తే ఇప్పుడు మరింతగా గోరంగా పడిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్లు తీవ్రంగా నిరాశపరిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్ ఇమ్రాన్ హాసిని వంటి పెద్ద స్టార్లు నటించిన ఈ చిత్రం కోటి రూపాయలు మార్కులు అందుకోవడంలో చాలా ఘోరంగా విఫలమయిందని వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో లావిస్ గా తీసిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యిందని సమాచారం.

అయితే ఈ సినిమా తెరకెక్కించిన విధానంలో లోపాలపై క్రిటిక్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజమహత తెరకెక్కించిన ఈ చిత్రం 2019 మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ కి ఆధారంగా ఈ సినిమాని రీమేక్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్షయ్ కుమార్ దాదాపుగా 9 సినిమాలలో నటించక కేవలం ఒక్క సినిమాలలోనే అతిథి పాత్రలో నటించారు ఆ సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలు కూడా గోరంగా పరాజయాన్ని చూశాయి ముఖ్యంగా సౌత్ రిమిక్ చేసిన సినిమాలు కూడా అక్షయ్ కుమార్ సక్సెస్ కు దోహదపడలేకపోయాయి. మరి రాబోయే రోజుల్లోనైనా సరైన కథల ఎంపిక తో అక్షయ్ కుమార్  సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: