బాలయ్య,తేజ కాంబో మూవీ ఆగిపోవడానికి కారణం అదేనా...?

murali krishna
మొదటి సినిమా 'చిత్రం' తో డైరెక్టర్ గా పరిచయం అయినా తేజ ఆ తరువాత నువ్వు నేను మరియు జయం లాంటి వరుస సినిమాలతో విజయాలు అందుకొని అప్పట్లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు ను పొందారు.ఆ తరువాత తేజ డైరెక్షన్ చేసిన చాలా సినిమాలు బాక్సఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి.ఇక చాలా రోజుల తరువాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టిన తేజ ఆ తరువాత బాలయ్య తో సినిమా చేయాలి కానీ అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయిందటా..ఎందుకంటే ఆ సినిమా సీనియర్ ఎన్టీయార్ బయోపిక్.
ఆ సినిమా స్టోరీ డిస్కషన్ లో ఉన్నప్పుడే తేజ దాంట్లో కొన్ని సీన్స్ కూడా రాశారట అవి ఎన్టీయార్ కెరియర్ లో చేసిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ ని కూడా రాశారట దాంతో ఎన్టీయార్ ని ఓన్లీ మనం పాజిటివ్ గానే చూపించాలి తప్ప నెగిటివ్ గా అస్సలు చూపించకూడదు అని మూవీ టీం అంటే అలాంటప్పుడు ఇది బయోపిక్ ఎలా అవుతుంది అని తేజ అన్నాడట.అయినా కూడా సినిమా స్టోరీ ఇలానే ఉండాలి అని వాళ్ళు అనడం తో స్టోరీ అలా ఉంటె నేను అస్సలు చేయలేను అని తేజ ఆ సినిమా నుంచి బయిటికి వచ్చేసారని సమాచారం..ఏదైనా భయపడకుండా మొహం మీదే చెప్పేయడం తేజ కి అలవాటు... ఇక ఆ తరువాత బాలయ్య మన సినిమాకి డైరెక్టర్ గా ఎవరిని తీసుకుందాం అని ఆలోచిస్తున్నప్పుడు అంతకు ముందే బాలయ్య తో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేసి మంచి హిట్ కొట్టారు కాబట్టి క్రిష్ నే ఈ సినిమా కి డైరెక్టర్ గా తీసుకుందాం అనుకొని ఆయన్నే ఫిక్స్ చేసేసారని తెలుస్తుంది.. కథానాయకుడు మరియు మహానాయకుడి గా విడుదల అయినా ఈ రెండు సినిమాలు బాక్సఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి...అలా తేజ బాలయ్య ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ని అయితే మిస్ చేసుకున్నారు...ప్రస్తుతం తేజ సురేష్ బాబు కొడుకు రానా తమ్ముడు అయిన అభిరామ్ ని హీరోగా పెట్టి అహింస అనే సినిమాను తీస్తున్నారు..ఈ సినిమా మీదే తేజ చాలా ఆశలు అయితే పెటుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: