పవన్ ... సాయి ధరమ్ తేజ్ రీమిక్ మూవీ లో ఆ చేంజ్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రస్తుతం సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతం అనే మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే తమిళ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ సినిమాను కొంత కాలం క్రితమే తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను అలరించింది. అలా వినోదయ సీతం పేరుతో ఇప్పటికే తమిళ్ మరియు తెలుగు లో విడుదల అయ్యి అద్భుతమైన రీతిలో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమాను తెలుగు లో పవన్ కళ్యాణ్ ... సాయి దరమ్ తేజ్ లతో కలిసి ప్రస్తుతం రీమిక్ చేస్తున్నారు.

ఈ మూవీ కి ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించినటు వంటి సముద్ర కని దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజులను కేటాయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ 25 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు ... ఆ 25 రోజుల లోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ బాగాన్ని మొత్తం పూర్తి చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ ఈ మూవీ యూనిట్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా రీమేక్ మూవీ అయినప్పటికీ ఒరిజినల్ కు ఈ సినిమాకు చాలా వరకు స్క్రిప్ట్ లో తేడాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ లో ఎలాంటి పాటలు లేవు. కాకపోతే తెలుగు వర్షన్ లో మాత్రం ఒక పాట ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ కథలో చాలానే మార్పులు చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: