ఆమెని పట్టించుకునే వారే లేరు..!

shami
మిర్చి లాంటి కుర్రాడు అంటూ తన మొదటి సినిమా ఎవరికి తెలియకపోయినా డైరెక్టర్ క్రిష్ దృష్టిలో పడిన ప్రగ్యా జైశ్వాల్ కంచె సినిమాతో ఒక పాపులారిటీ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలైతే వచ్చినా అమ్మడు వాటిని సరిగా వాడుకోలేకపోయింది. చేయడానికి నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలతో కలిసి నటించిన సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు. అఖండ తో బాలయ్యకి సూపర్ హిట్ అందించిన ప్రగ్యా ఆ సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క ఛాన్స్ అందుకోలేదు. మరి ప్రగ్యా వల్ల సినిమాలకు పెద్ద మైలేజ్ రావట్లేదని అనుకుంటున్నారా లేక మరేమో కానీ అమ్మడిని లైట్ తీసుకుంటున్నారు.
ఇక తనకు అవకాశాలు రాకపోవదంతో అమ్మడు ఇక ఫోటో షూట్ ల మీద పడ్డది. రకరకాల ఫోటో షూట్స్ తో ఆడియన్స్ దృష్టిలో పడాలని చూస్తుంది ప్రగ్యా. ఛాన్స్ ల కోసం ఎలాంటి పాత్రలకైనా రెడీ అని హింట్ ఇస్తున్నా సరే అమ్మడికి ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. బాలకృష్ణతో అఖండ చేశాక ఆ సినిమా హిట్ అందుకోగానే మళ్లీ ప్రగ్యా తిరిగి ఫాం లోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఎందుకో అమ్మడి బ్యాడ్ లక్ వల్ల ఛాన్స్ లు రావట్లేదు. అసలు ప్రగ్యాని హీరోయిన్ గా పరిగణ చేయట్లేదని ఇన్నర్ టాక్.
ప్రగ్యా మాత్రం ఎప్పుడైనా రాని ఒక మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. అప్పటి వరకు ఆడియన్స్ ని అలరించేలా ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. లేటెస్ట్ గా డార్క్ బ్లూ లెహెంగా డ్రెస్ లో కేక పెట్టిస్తుంది అమ్మడు. ఇంత అందం ఆడియన్స్ ని మెప్పించే అభినయం ఉన్నా సరే ప్రగ్యాకి ఛాన్స్ లు రావట్లేదు. ఈ విషయంలో ఆమెని అభిమానించే ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. బాలీవుడ్ లో ఒకటి రెండు ప్రజెక్ట్ లు చేసినా అక్కడ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అందుకే తెలుగులోనే అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ప్రగ్యా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: