రాజమౌళి వల్లనే పొన్నియం సెల్వం తీయగలిగాను : మణి రత్నం

murali krishna
రాజమౌళి రూపొందించిన బాహుబలి వల్లే పాన్ ఇండియా చిత్రాల హవా అయితే పెరిగింది అనేది వాస్తవం. ఇండియా సినిమా భాషా బేధాలు తొలగించి న రాజమౌళి అంతటా ప్రశంసలు దక్కించుకుంటున్నారు.
అంతర్జాతీయం గా కూడా రాజమౌళి పేరు బాగా మారుమోగుతోంది. స్టీవెన్ స్పీల్ బర్గ్ మరియు జేమ్స్ కామెరూన్ లాంటి మహామహులు కూడా జక్కన్న టేకింగ్ కి ఫిదా అయ్యారు.
ఇటీవల చెన్నై లో జరిగిన డైరెక్టర్స్ సమ్మిట్ లో రాజమౌళి, మణిరత్నం మరియు సుకుమార్ లాంటి దర్శకులు పాల్గొన్నారు. ఈ కారక్రమం లో వీరి ముగ్గురి మధ్య ఆసక్తి కర సంభాషణ జరిగింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం.. రాజమౌళి తనని ఎలా ఇన్స్పైర్ చేశారో.. పొన్నియన్ సెల్వం చిత్రం పూర్తి కావడానికి ఎలా కారణం అయ్యాడో కూడా వివరించారు.
మీ అందరికి తెలుసు.. పొన్నియన్ సెల్వం చిత్రం తెరకెక్కించడానికి నేను ఎన్నో ఏళ్ళు నేను ఎదురుచూశాను. అంత పెద్ద చిత్రం రూపొందించడానికి నాకు సరైన మార్గం అయితే కనిపించలేదు. అప్పుడే బాహుబలి చిత్రం వచ్చింది.. అది కూడా రెండు భాగాలుగా వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. అప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. పెద్ద కథలని ఇలా కూడా చెప్పవచ్చు అని అప్పుడే నాకు అనిపించింది.
బాహుబలి రెండు భాగాలుగా రాకపోయి ఉంటే పొన్నియన్ సెల్వం సాధ్యం అయ్యేది అయితే కాదు అని మణిరత్నం అన్నారు. వెంటనే రాజమౌళి స్పందిస్తూ.. సర్ ఇది నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని మణిరత్నంతో అన్నారట..
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుకి అడుగు దూరంలో అయితే ఉంది.రాజమౌళి చిత్రానికి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుంది అని ఇండియన్ సినిమా మేకర్స్ అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. నిజంగా ఆస్కార్ వస్తే ప్రపంచమంతా రాజమౌళి పేరు వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: