బాబోయ్ శ్రీయా ఏంటీ అరాచకం..!

shami
శ్రీయ శరణ్ సౌత్ ఆడియన్స్ కు అసలు పరిచయం అవసరం లేని పేరు. ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మార్క్ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్ధాలు అవుతున్నా ఇప్పటికీ సినిమా ఛాన్స్ లు అందుకుంటుంది అమ్మడు. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించిన అమ్మడు ఇప్పుడు సీనియర్ హీరోల సరసన నటిస్తుంది. అంతేకాదు సినిమాలో కీలకమైన పాత్ర ఏదైనా ఉంటే మాత్రం అది చిన్నదైనా సరే ఓకే అంటుంది. ఎలాగైనా సరే తనకు వచ్చిన అవకాశాలను వదలకుండా చేస్తుంది శ్రీయ.
ఇక పెళ్లి తర్వాత కెరీర్ మందగించినా వచ్చిన సినిమానే చేస్తూ వెళ్తుంది. ఇక ఓ బిడ్డకు తల్లైనా సరే శ్రీయ ఫిజిక్ విషయంలో షేప్ అవుట్ కాలేదు. అంతేకాదు తన ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. శ్రీయ ఫోటో షూట్స్ తో ఆడియన్స్ అవాక్కవుతున్నారు. అమ్మడు సోయగాల వలలో ప్రేక్షకులు చిక్కుకుని విల విలలాడుతున్నారు. ఈమధ్యనే శారీలో అదరగొట్టే అందాల విందు అందించిన అమ్మడు లేటెస్ట్ గా బ్లూ కలర్ డ్రెస్ లో తొడల అందాలను సైతం చూపిస్తూ రెచ్చిపోయింది.
శ్రీయ ఇలా గ్లామర్ షో చేయడం కొత్తేమి కాదు కానీ ఈ ఏజ్ లో అమ్మడు తన అందాలతో ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. 40 ఏళ్లు వయసులో తన నాటు అందాలతో అమ్మడు అరుపులు పెట్టిస్తుంది. తన ఫోటో షూట్ చూసిన ఆడియన్స్ అమ్మడు ఏంటీ అరాచకం అనేస్తున్నారు. రోజుకొక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నా సరే శ్రీయ మాత్రం ఇంకా తన ఐడెంటిటీ కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అమ్మడు ఇక మీదట కూడా ఇదే రేంజ్ లో రెచ్చిపోవాలని ఫిక్స్ అయింది అందుకే రోజు రోజుకి శృతి మించిపోయేలా అందాల ప్రదర్శన చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: