ఆ నలుగురు ఎవరో తెలుసా....!!

murali krishna
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో త్రో బ్యాక్ నడుస్తోంది. సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!
         ఈ ఫోటోలో ఉన్న హీరోలు ఎవరో గుర్తుపట్టారా అంటూ క్యాప్షన్ లు కూడా జోడిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు వారి చిన్ననాటి ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే ఈసారి ఫోటోలు  ఒకరు కాదు ఏకంగా నలుగురు ఉన్నారు. నలుగురు సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఉన్న ఆ నలుగురు చిన్నారులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
           అయితే ఆ ఫోటోలో ఉన్న ఆ నలుగురు చిన్నారులు ఎవరెవరో కాదు. ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన తమ్ముడు అల్లు శిరీష్. అలాగే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, చెర్రీ సోదరి సుస్మిత కొణెదల. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలో బన్నీ, సుస్మిత క్యూట్ స్మైల్స్ తో ఫోటోలకు ఫోజులిస్తుండగా, రామ్ చరణ్ క్యూట్ లుక్స్ లో చూడడానికి ముద్దొస్తున్నాడు. ఇక అల్లు శిరీష్ అల్లరి చేస్తూ కనిపిస్తున్నారు. ఈ నలుగురు ఒక్క చోటే దర్శనమిస్తున్న ఈ ఫోటోను చూసి అల్లు, మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ ముగ్గురు హీరోల విషయానికొస్తే.అల్లు అర్జున్ 2021 లో విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారగా ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. అలాగే రామ్ చరణ్ గగత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాతో చెర్రీ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే అల్లు అర్జున్ గత ఏడాది ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు శిరీష్ కి సంబంధించి ఎటువంటి సినిమా అప్డేట్లు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: