వీరసింహారెడ్డికి తమిళ తంబీలు ఫిదా?

Purushottham Vinay
నందమూరి నటసింహం బాలకృష్ణ రీసెంట్ గా "వీరసింహరెడ్డి" సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు.యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో హీరో పాత్ర పోషించి చాలా అద్భుతంగా ఆకట్టుకున్నాడు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా దాదాపు 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాల కృష్ణ కెరీర్ లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.మిక్స్డ్ టాక్ తెచ్చుకోని ఫైనల్ రన్ లో సూపర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.ఇక ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "వీర సింహారెడ్డి" సినిమా విజయవిహారం చేస్తోంది. "వీర మాస్ బ్లాక్ బస్టర్" అని థియేటర్స్ లో విజృంభించినట్టే ఓటీటీలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది.


యాక్షన్ కి సెంటిమెంట్ ని కలిపి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి సకుటుంబ సపరివార సినిమాగా ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. వీర సింహారెడ్డిగా జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనకి బాలయ్య పండించిన ఎమోషన్ కి ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతి అవుతున్నాయి. కొత్త తరహా కథ సెంటిమెంట్ నీ యాక్షన్ నీ సమపాళ్లతో కలిపిన కథనం "వీర సింహారెడ్డి" ప్రత్యేకతలుగా నిలిచాయి.సిస్టర్ సెంటిమెంట్ అనేది ఈ కథలో చాలా కీలకమైన అంశం.ఇంకా మరెన్నో యాక్షన్ సీక్వెన్స్ లతో పూర్తి ఎంటర్ టైనర్ గా "వీర మాస్ బ్లాక్ బస్టర్" గా "వీరసింహా రెడ్డి" ఓటీటీలో కూడా ఒక రేంజిలో అదరగొడుతోంది. మరీ ముఖ్యంగా తమిళ ప్రేక్షకులని ఈ సినిమా ఎంతగానో ఫిదా చేస్తుంది. ఓటిటిలో తమిళ జనాలు ఈ సినిమాకి బ్రహ్మ రథం పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: