కీరవాణి కొడుకు పై పవన్ అభిమానుల అసహనం ?

Seetha Sailaja
కీరవాణి సినీ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో అతడి ఇద్దరు కుమారులలో ఒకడు సంగీత దర్శకుడుగా ఇప్పటికే రాణిస్తూ ఉంటే మరొక కుమారుడు సింహా కోడూరి హీరోగా సెటిల్ కావడానికి తన వంతు ప్రయత్నాలు చాల గట్టిగానే చేస్తున్నాడు. రాజమౌళి లాంటి టాప్ దర్శకుల అండ ఉన్నప్పటికీ అతడికి ఇప్పటివరకు చెప్పుకోతగ్గ బ్రేక్ రాలేదు.

అతడు నటించిన మొట్టమొదటి సినిమా ‘మత్తు వదలరా నిద్దురా’ ఒక మోస్తరి విజయాన్ని అందుకున్నప్పటికీ అతడి రెండవ సినిమా ‘తెల్లవారితే గురువారం ఆతరువాత వచ్చిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో సింహా ఖంగ్ తిన్నాడు. దీనితో ఒక కొత్త కథను నమ్ముకుని ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు ‘ఉస్తాద్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఈవిషయం అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారంతా సింహా పై అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికి కారణం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ త్వరలో నటించబోయే సినిమాకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అన్న టైటిల్ ఇప్పటికే ఫిక్స్ చేసారు. వాస్తవానికి ఈసినిమా షూటింగ్ ఇప్పటివరకు మొదలుకాలేదు. అయినప్పటికీ పవన్ కోసం రిజర్వ్ చేసిన టైటిల్ లోని కొన్ని పదాలను ఏదైర్యంతో సింహా కోసం వాడుతున్నారు అంటూ పవన్ అభిమానులు అసహనానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడ ఇలాగే నాని సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసి చిరంజీవి అభిమానులకు విపరీతమైన కోపం వచ్చింది. చిరంజీవి బ్లాక్ బష్టర్ మూవీ టైటిల్ ను తన సినిమాకు పెట్టుకునే స్థాయిలో నానిఉన్నదా అంటూ సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు సెటైర్లు కూడ వేసారు. దీనిపై నాని అప్పట్లో క్లారిటీ ఇచ్చుకోవలసి వచ్చింది. ఇప్పుడు సింహా విషయంలో కూడ ఇలాంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనితో ఈ వ్యవహారం ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందో అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: