ఆ విషయంలో అల్లు అర్జున్ టెన్సన్ పడుతున్నాడా...?

murali krishna
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.. ఈ సినిమా 2021 డిసెంబర్ లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్  విజయం సాధించింది.
400 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను అందించిన ఈ సినిమాను ఇప్పుడు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
సుకుమార్ కూడా అన్నివిధాలా స్క్రిప్ట్ ను భారీ మార్పులు చేర్పులు చేసారు.. ఫ్యాన్స్ అంతా గత ఏడాదిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా పార్ట్ 2 ఎట్టకేలకు ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ కూడా అయ్యింది.. ఒకే ఒక్క సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా అయితే నిలబెట్టింది.. ఇక ఇప్పుడు పార్ట్ 2 తో కూడా అల్లు అర్జున్ విజయం అందుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది.
మరి ఇక్కడ వరకు బాగానే ఉన్న ప్రస్తుతం అల్లు అర్జున్ కి కొత్త టెన్షన్ మొదలు అయినట్టు తెలుస్తుంది.. ఎందుకంటే పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప ది రూల్ తర్వాత తన ఇమేజ్ కు తగినట్టుగా కథలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి.. తన ఇమేజ్ కు తగినట్టుగా ఎలాంటి కథలను ఎంచుకోవాలి . ఏ డైరెక్టర్ తో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచన ఇప్పుడు అల్లు అర్జున్ ని బాగా ఇబ్బంది పెడుతుందంట. ఇక అల్లు అర్జున్ టెన్షన్ కు మరో కారణం కూడా ఉంది.. అందుకు కారణం అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కూడా ఖాళీగా లేడు.. రాజమౌళి నుండి త్రివిక్రమ్ వరకు అందరూ కూడా బిజీగానే ఉన్నారు. మళ్ళీ సుకుమార్ తో చేయాలి అంటే కుదరదు.రాజమౌళి మహేష్ తో, ప్రశాంత్ నీల్ ప్రభాస్, ఎన్టీఆర్ లతో మరియు త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఇలా అందరూ కూడా బిజీగా వున్నారు... అందుకే తరువాత ఎవరితో చేయాలి అనే విషయంలో అల్లు అర్జున్ కూడా బాగా టెన్షన్ పడుతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: