భోళా: ఖైదీ హిందీ రీమేక్ పై తమిళ తంబీల ట్రోల్స్?

Purushottham Vinay
బాలీవుడ్ మేకర్స్ సౌత్ లో హిట్ అయిన సినిమాలను తీసుకొని అక్కడ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీమేక్ సినిమాలని వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా తీయకుండా, లేదా వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు సింపుల్ గా మార్పులు చేసి తీయకుండా బాలీవుడ్ మేకర్స్ ఇక్కడి కథలో వాళ్ళ సొంత ప్రయోగాలు చేస్తుండటంతో ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ కూడా అక్కడ ఫ్లాప్స్ గా మిగిలిపోతున్నాయి.ఈ విషయంలో సౌత్ ప్రేక్షకులు బాలీవుడ్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు కూడా. తాజాగా తెలుగులో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా అలవైకుంఠపురంలో హిందీలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో షెహజాదాగా రీమేక్ చేశారు. ఈ సినిమాలో కూడా చాలా పాయింట్స్ మార్చడంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా సౌత్ సినిమా కథలని తీసుకొని వాళ్లకు  ఇష్టమొచ్చిన మార్పులు చేసి సినిమా ఒరిజినాలిటీని పోగొడుతున్నారు. ఇక తాజాగా భోళా సినిమాలో కూడా అదే పని చేస్తున్నారు.


ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే సౌత్ ప్రేక్షకులు, ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు భోళా సినిమా చిత్రయూనిట్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.ఒరిజినల్ ఖైదీ సినిమాలో అయితే అసలు హీరోయిన్, సాంగ్స్ ఏమి ఉండవు,అలాగే లేడి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉండరు. కానీ హిందీ భోళా సినిమాలో అయితే లేడీ పోలీసాఫీసర్ గా టబు నటిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అమలాపాల్ నటిస్తుంది. ఇప్పుడు ఏకంగా హీరో, హీరోయిన్ మధ్య నజర్ లాగ్ జయేగి అంటూ ఓ పాటని కూడా రిలీజ్ చేయడంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు తమిళ తంబీలు.ఖైదీ సినిమా అయితే అంతా ఒక్క రాత్రిలో యాక్షన్, సస్పెన్స్ సీన్స్ తో అయిపోతుంది. వీళ్ళు భోళా సినిమాలో లేడీ పోలీసాఫీసర్, హీరోయిన్ ఇంకా హీరోయిన్ తో రొమాన్స్ అలాగే మార్నింగ్ సీన్స్.. ఇలా ఇష్టమొచ్చినట్టు కథని దారుణంగా నాశనం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రీమేక్ కూడా ఫ్లాప్ అవుతుంది అని తమిళ తంబీలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: