మనీ: ఈ బిజినెస్ తో రూ.50వేలకు పైగా ఆదాయం..!

Divya
ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడడం కంటే వ్యాపారంలో సక్సెస్ అయితే అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి వీలు ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వ్యాపారం గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.. సాధారణంగా కొన్ని కొన్ని వ్యాపారాలకు సీజన్తో సంబంధం ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ మాత్రం సీజన్తో సంబంధం లేకుండా అంతకుమించి ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ రంగానికి భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు చక్కటి ఫుడ్ బిజినెస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్రతినెలా ఊహించిన దాని కంటే ఎక్కువ లాభం పొందవచ్చు.
ఈ బిజినెస్ ఏమిటంటే ఫ్రెంచ్ ఫ్రైస్.. దీనిని ఇప్పుడు తినడం ఒక కల్చర్ గా మారిపోయింది.  పార్కులు, సినిమా థియేటర్లు,  మాల్స్,  రెస్టారెంట్లలో కూడా అన్ని చోట్ల వీటిని తినడానికి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  కాబట్టి దీనిని మీరు వ్యాపార అవకాశంగా మార్చుకున్నట్లయితే అంతకుమించి చక్కటి ఆదాయం పొందుతారు.. మీరు దీనిని ఒక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ వ్యాపారం ప్రారంభించి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది.  ప్రస్తుతం మార్కెట్లో ఫ్రెంచ్ ఫ్రైయర్ మెషిన్ విలువ రూ.30 వేల వరకు ఉంటుంది.
మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ ముడి సరుకులు మార్కెట్లో కొనుగోలు చేసి ఫ్రైయర్ మెషిన్ లో నూనె పోసి వేయిస్తే చాలు ఒక్కో ప్యాకెట్టు మీరు 50 రూపాయల కంటే ఎక్కువే విక్రయించవచ్చు.. అలాగే ఫ్రెంచ్ ప్రైస్ తో పాటు టొమాటో సాస్ కూడా అందించాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ వ్యాపార డిమాండ్ పెరగాలంటే రకరకాల ఫ్లేవర్స్ అది అమ్మడం ద్వారా చక్కటి సేల్స్ సాధించి వీలు. ప్రతిరోజు రూ.3000 నుంచి 5000 రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు దీన్ని బట్టి చూస్తే నెలకు రూ.50 వేలకు పైగానే  దీని నుంచి లాభం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: