ధనుష్ సక్సెస్ ని తట్టుకోలేకపుతున్న తలపతి ఫ్యాన్స్?

Purushottham Vinay
తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఇంకా తమిళ స్టార్ హీరో ధనుష్ కలయికలో వచ్చిన రీసెంట్ మూవీ 'సార్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ కెరీర్ లో ఫస్ట్ బై లింగువల్ మూవీ.తెలుగు నిర్మాణ సంస్థలు అయిన శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంకా అలాగే ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ మూవీలో ధనుష్ కి జంటగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి.. తన మునపటి సినిమాల జోనర్ నుంచి బయటకి వచ్చి, ఒక సోషల్ ఎలిమెంట్ తో ఈ సినిమాని చాలా చక్కగా మలిచాడు. చదువుని వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.ఫిబ్రవరి 17 వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వగా, తొలి రోజు నుంచే కలెక్షన్స్ దూకుడు చూపిస్తుంది. ఈ సినిమాకి తమిళనాడు లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ప్రీమియర్ షోలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 50కు పైగా ప్రీమియర్స్ పడడంతో సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. ధనుష్ సూపర్ హిట్ మూవీ 'రఘువరన్ బీ-టెక్' లైఫ్ టైం కలెక్షన్స్ ని కూడా చాలా ఈజీగా క్రాస్ చేసింది.


ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకొని రెండో వీక్ లో అడుగుపెట్టిన ఈ మూవీకి సంబంధించి చిత్ర నిర్మాతలు కలెక్షన్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.51  కోట్ల పైగా గ్రాస్ సాధించింది. దీనిబట్టి చూస్తే నెట్ షేర్ రూ.25 కోట్ల పైనే వచ్చినట్లు అర్ధమవుతుంది. దీంతో ఈ మూవీ బడ్జెట్ లో 90 శాతం పైగా కేవలం మూడు రోజుల్లోనే రాబట్టి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా సార్ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమాతో ధనుష్ కి అయితే తెలుగులో గ్రాండ్ ఎంట్రీ వచ్చింది. త్వరలో మరో టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కములతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.ఇదిలా ఉంటే విజయ్ ఫ్యాన్స్ కి మాత్రం కడుపు మంటగా ఉంది. ఎందుకంటే ధనుష్ స్ట్రెయిట్ గా తెలుగు మూవీతో వచ్చి మంచి హిట్ కొట్టి సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతున్నాడు. ఈ విషయంలో విజయ్ ఫెయిల్ అయ్యాడు. అతడి వారసుడు సినిమా తెలుగులో అంతగా రాణించలేకపోయింది. కానీ ధనుష్ మూవీ సార్ మాత్రం స్టడీగా వసూళ్లు చేస్తూ ఇప్పటికే తెలుగులో లాభాల బాట పట్టింది. దీంతో సోషల్ మీడియాలో ధనుష్ అభిమానులకి విజయ్ అభిమానులని యుద్ధం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: