తారకరత్న మరణించడంతో వైరల్ గా మారిన వేణు స్వామి వీడియోలు..!

Divya
యంగ్ హీరో తారకరత్న గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి శనివారం మహాశివరాత్రి రోజున ఆయన మరణించడం జరిగింది. 40 సంవత్సరాలు కూడా నిండకుండానే తారకరత్న మరణించడం ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగిల్చింది అని చెప్పవచ్చు. ఇంత చిన్నవయసులోనే ఒక హీరోని ఇండస్ట్రీ కోల్పోవడంతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు.. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.
ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆయన బయటపెడుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాడు.  అయితే ఈయన చెప్పిన మాటలు దాదాపుగా నిజమయ్యాయి అని చెప్పాలి. నాగచైతన్య సమంత జాతకం ప్రకారం పెళ్లి చేసుకుంటే త్వరగా విడాకులు తీసుకుంటారని చెప్పారు. ఇక అందుకు తగ్గట్టుగానే నాలుగు సంవత్సరాలకే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయింది. అలాగే నయనతార విషయంలో కూడా విగ్నేష్ తో ప్రేమాయణం ఆమెకు కలిసి రాదు అని చెప్పాడు.. అందుకు తగ్గట్టుగానే వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్నోసార్లు ఆమె వివాదాలను చిక్కుకుంది.
ఇక గత రెండు నెలల క్రితం టాలీవుడ్ లో యంగ్ హీరో,  యంగ్ హీరోయిన్ మరణిస్తారు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు .. అయితే అప్పుడు వేణు స్వామి చెప్పిన మాటలను కొంతమంది కొట్టి పారేశారు కూడా.. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే వేణు స్వామి చెబుతున్న మాటలు నిజం అవుతున్నాయని ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయాందోళనలకు గురి అవుతున్నారు.  వేణు స్వామి చెప్పినట్టుగానే 40 యేళ్లు కూడా నిండకుండానే తారకరత్న మరణించారు. ఇక వేణు స్వామి చెప్పినట్టు టాలీవుడ్ యంగ్ హీరో మరణించారు.. అయితే ఇప్పుడు ఆ యంగ్ హీరోయిన్ ఎవరా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. మొత్తానికైతే వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు తారకరత్న మరణంతో మళ్ళీ తెరపైకి రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: