బాహుబలి 3 ప్లాన్ కి జక్కన్న రెడీ.. అయితే..?

Purushottham Vinay
లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమా హిట్ తో దర్శక దిగ్గజం రాజమౌళి ఒక్కసారిగా గ్లోబల్ లెవెల్ లో భారీ క్రేజ్ సంపాదించాడని చెప్పాలి. జేమ్స్ కామెరూన్,  స్టీవ్ స్పిల్ బర్గ్ లాంటి హాలీవుడ్ లెజెండరీ దర్శకుల ప్రశంసలు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో రాజమౌళి అందుకోవడం నిజంగా ఇండియాకి గొప్ప విషయం అని చెప్పాలి.ఇక ఇప్పుడు ఆస్కార్ రేస్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీ కూడా పోటీ పడుతుంది. కచ్చితంగా ఆస్కార్ అవార్డు నాటు నాటు పాటకి వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాతనే గ్లోబల్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.హాలీవుడ్ ప్రముఖులు చాలా మంది కూడా ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లోనే చూసి సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలని పంచుకున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాకి కావాల్సినంత క్రేజ్ వచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి నెట్ ఫ్లిక్స్ కో ఫౌండర్ టెడ్ సర్నాడోస్ ని కలుసుకున్నారు.


గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో భాగంగా ఇండియా వచ్చిన అతన్ని రాజమౌళితో పాటు ఇంకా అతని తనయుడు కార్తికేయ అలాగే బాహుబలి సిరీస్ నిర్మాతల్లో ఒక్కడైన శోభు యార్లగడ్డ కలుసుకున్నారు.ఇక ప్రస్తుతం వీరి కలయికకి సంబందించిన ఫోటో కూడా బయటకి వచ్చింది. దీంతో బాహుబలి ప్రీక్వెల్ వెబ్ సిరీస్ మరోసారి ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. గతంలో నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో శివగామి కథని ప్రధానంగా చేసుకొని బాహుబలి ప్రీక్వెల్ ని ప్లాన్ చేశారట. దేవకట్టా ఇంకా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొన్ని ఎపిసోడ్స్ కూడా షూట్ చేశారు. అయితే ఈ అవుట్ పుట్ పై నెట్ ఫ్లిక్స్ సంతృప్తి చెందకపోవడంతో ఇక దానిని పక్కన పెట్టారు. అయితే రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో మళ్ళీ ఈ బాహుబలి ప్రీక్వెల్ వెబ్ సిరీస్ తెరకెక్కించే ఆలోచనలో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపధ్యంలో వారి కలయిక జరిగిందనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ ప్రమోషన్ విషయంలో నెట్ ఫ్లిక్స్ టీమ్ కి థాంక్స్ చెప్పేందుకు ఎస్ ఎస్ రాజమౌళి కలిసారని సమాచారం వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: