పఠాన్: ఈ వీక్ లో 1000 కోట్లు పక్కా?

Purushottham Vinay
పఠాన్: ఈ వీక్ లో 1000 కోట్లు పక్కా?

బాలీవుడ్ లో ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా.. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ ఇప్పుడు నిజంగానే బాలీవుడ్ బాద్షా అనిపించుకున్నాడు.ఎందుకంటే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గత కొన్నాళ్లుగా హిట్ లేక ఎంతగానో సతమతం అవుతున్న నేపథ్యంలో పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మెస్మరైజ్ చేసాడు. ఇక బాలీవుడ్ ఘోరంగా విమర్శలు ఎదుర్కున్న క్రమంలో షారుఖ్ ఖాన్ ఈ సినిమాతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఊరట కలిగించాడు..బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది. 


ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ కలెక్షన్స్ కూడా రాబడుతుంది.. విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్న ఇంకా పఠాన్ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి.. ఈ సినిమా షారుఖ్ ఖాన్ కెరీర్ లో బిగ్ బ్రేకింగ్ కం బ్యాక్ గా నిలిచింది.ఇంకా నార్త్ బెల్ట్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా దూసుకెళ్తుంది.. ఇక ఇటీవలే 900 కోట్ల పైగా కలెక్షన్స్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు 1000 కోట్ల దిశగా ఈ సినిమా పరుగులు పెడుతుంది.. ఇందులో ఎక్కువ వసూళ్లు మాత్రం హిందీ నుండి రావడం విశేషం.. ఇప్పటికీ లాంగ్ వీకెండ్ లలో పఠాన్ సినిమా బాగానే ఆడుతుంది.. ఇక ఈ సినిమా ఈ వీకెండ్ కి ఆల్ మోస్ట్ 1000 కోట్ల దగ్గరికి వచ్చేయగా నెక్స్ట్ వీకెండ్ నాటికీ  ఖచ్చితంగా 1000 కోట్లను క్రాస్ చేయడం ఖాయంగా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: