ఆ హీరోయిన్ వల్ల శర్వానంద్ కెరీర్ రిస్క్ లో పడిందా...?

murali krishna
శర్వానంద్ తన సొంత కాళ్ళ మీద నిలబడాలనే తపనతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు.కెరీర్ ప్రారంభంలో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన శర్వానంద్ ఆ తర్వాత హీరో గా మారి హిట్స్ మరియు బ్లాక్ బస్టర్ హిట్స్  కూడా అందుకున్నాడు.గమ్యం సినిమాతో హీరో గా తొలి సక్సెస్ ని అందుకున్న శర్వానంద్, ఆ తర్వాత ప్రస్థానం,రన్ రాజా రన్, ఎక్సప్రెస్ రాజా, శతమానం భవతి మరియు మహానుభావుడు అలాగే ఒకే ఒక జీవితం వంటి కమర్షియల్ సూపర్ హిట్స్ ని అందుకొని ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయి కి ఎదిగాడు.
ఇక రీసెంట్ గానే ఆయన కొంతకాలం నుండి ప్రేమిస్తున్న రక్షిత రెడ్డి తో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.ఈ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.వచ్చే నెలలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం..
ఇది ఇలా ఉండగా ఈ పెళ్లి నిశ్చయం అవ్వకముందే శర్వానంద్ ఒక ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపినట్టు అప్పట్లో ఒక రూమర్ మాత్రం జోరుగా ప్రచారం సాగింది.ఆమె ప్రస్తుతానికి కూడా సూపర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ అని తెలుస్తుంది.వీళ్లిద్దరి పెళ్లి చేసుకుందాం అనుకున్నారని,కానీ ఆ హీరోయిన్ ఇంట్లో వీళ్లిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదని సమాచారం.అందుకు కారణం శర్వానంద్ వరుస  ఫ్లాప్స్ లో ఉండడమే అని, తనని పెళ్లి చేసుకుంటే నీకు కూడా కెరీర్ అస్సలు ఉండదని ఆ హీరోయిన్ ని ఒప్పించి పెళ్లి క్యాన్సిల్ చేయించారట.

ఆ సమయం లో శర్వానంద్  డిప్రెషన్ లోకి వెళ్లి సరైన స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోక కెరీర్ ని రిస్క్ లో పెట్టుకున్నాడు అంటూ ఫిలిం నగర్ లో అప్పట్లో ఈ పుకారు  అయితే తెగ షికారు చేసింది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఏమిటి అనేది బయటకి రాలేదు.కొందరు ఎవరై వుంటారు అని తెగ ఆరాలు తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: