ఎట్టకేలకు సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం..!!

Divya
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే మీకు బాగా కావాల్సిన వాడినట్టు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అంటూ మరొక సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ రోజున రావడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చాలా గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాకు మంచి హైపు క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో చిన్న వయసు నుంచి అనాధగా కనిపిస్తారు. దీంతో చిన్న వయసు నుంచే విష్ణు జీవితంలో  నెంబర్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తలకెక్కించారు. ఒక యూట్యూబర్గా ట్రెండీగా వీడియోలు చేసే సెలబ్రిటీ అయిపోవాలని అందులో భాగంగా సైబర్ నెంబర్ కాల్ చుట్టుతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది డైరెక్టర్. ఇక ఇందులో హీరోయిన్గా దర్శన నటించింది. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం న్యాయం చేశారని తెలుస్తోంది పక్కింటి కుర్రాడిలా చక్కగా నటించారు.

ఇక గతంలో మాదిరి ఇందులో కూడా సాదాసీదాగా కనిపించారు. ఇందులో డాన్స్ ఫైట్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే మరింత బాగుండేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మురళి శర్మ పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోయాలా నటించారు. ఒక కథ సినిమాలకు పూర్తిగా భిన్నంగా ఆయన పాత్ర ఉంటుంది. శుభలేఖ సుధాకర్ హీరోయిన్ తల్లిదండ్రులుగా దేవిశ్రీప్రసాద్ ఆమని రైటర్ గా ప్రతి ఒక్కరు ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం చైతన్ భరద్వాజ్ సంగీతము. మొత్తానికి ఎట్టకేలకు మరొకసారి హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు కిరణ్ అబ్బవరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: