వామ్మో.. వాల్తేరు వీరయ్య సినిమాకు చిరు పారితోషకం ఎంతో తెలుసా?

praveen
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ఇక ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఒక్కరోజు ముందు విడుదలైన మరో సీనియర్ స్టార్ హీరో బాలయ్య వీర సింహారెడ్డి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇలాంటి సమయంలో ఇక వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అవుతుందా లేదా అనే భావన అందరిలో నిండిపోయింది. అయితే వాల్తేరు వీరయ్య సినిమా కూడా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి. వసూళ్ల విషయంలో బాలయ్య వీరసింహారెడ్డి సినిమాను దాటేసింది ఈ మూవీ.

 దాదాపు 200 కోట్ల రూపాయల వసూలు సాధించి ఇక చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరోసారి వింటేజ్ చిరంజీవిని చూసిన అభిమానులు అందరూ కూడా ఆనందంతో ఊగిపోయారు. ఇదిలా ఉంటే వాల్తేరు వీరయ్య సినిమా కోసం ఆటోఅటు చిరంజీవి ఎంత మొత్తంలో పారితోషకం తీసుకున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. గాడ్ ఫాదర్ సినిమా కోసం లాభాల్లో వాటా తీసుకున్నారట మెగాస్టార్ చిరంజీవి. అయితే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమా కోసం కొంత పారితోషకాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత లాభాల్లో కూడా వాటా తీసుకునే ఒప్పందం కుదుర్చుకున్నారు.

 కాగా వాల్తేరు వీరయ్య సినిమా దాదాపు 137 కోట్ల షేర్, 235 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరోవైపు డిజిటల్ శాటిలైట్స్ డబ్బింగ్ రూపంలో మరో 50 కోట్లు అదనంగా లాభాలు వచ్చాయి అని చెప్పాలి. దీంతో ఇక అటు నిర్మాతలు కూడా ఎంతో ఆనందంగా మెగాస్టార్ చిరంజీవికి లాభాల్లో వాటా ఇచ్చేసారట. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కోసం ఒకవైపు పారితోషకం.. మరోవైపు నుంచి లాభాల్లో వాటా మొత్తం కలిపి 50 కోట్ల వరకు అందుకున్నాడు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్. ఇక సీనియర్ హీరో అయినప్పటికీ ఈ రేంజ్ లో పారితోషకం అందుకున్న హీరోగా చిరు రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: