అదే జరిగితే ఎన్.టి.ఆర్ రచ్చ కన్ఫర్మ్..!

shami
ఎన్.టి.ఆర్ నట విశ్వ రూపం గురించి అందరికి తెలిసిందే. ఈ తరం కథానాయకులలో నవరసాలను పండించగలిగిన నటుడు ఎవరంటే అందరు చెప్పే పేరు ఎన్.టి.ఆర్. ఆయన అభినయం, ఆహార్యం అంతా నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడిని కూడా మెస్మరైజ్ చేస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రతో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అలరించాడు తారక్. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరక్షన్ లో 30వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కొన్నాళ్లుగా వాయిదా పడుతున్నా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ 31వ సినిమా ఆల్రెడీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఫిక్స్ అయ్యింది. కె.జి.ఎఫ్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఆయన డైరెక్షన్ లో తారక్ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఎన్.టి.ఆర్ సినిమా షురూ చేయనున్నారు. ఇక ఎన్.టి.ఆర్ 31 తర్వాత 32వ సినిమా క్రేజీ కాంబో సెట్ చేసినట్టు తెలుస్తుంది.
ఎన్.టి.ఆర్ 32వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ 32వ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయట పెట్టాడు నిరామత సూర్యదేవర నాగవంశీ. ఎన్.టి.ఆర్ 32వ సినిమా త్రివిక్రం డైరెక్షన్ లో ఉంటుందని. మైథలాజికల్ సబ్జెక్ట్ తో ఆ సినిమా చేస్తామని అన్నారు. అసలే అక్కడ త్రివిక్రం అది కూడా ఎన్.టి.ఆర్ లాంటి హీరోతో మైథలాజికల్ మూవీ అంటే ఇక రచ్చ కన్ ఫర్మ్ అన్నట్టే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్ సీన్స్ తో సినిమాలు చేస్తూ వస్తున్న త్రివిక్రం తారక్ తో మైథలాజికల్ సినిమా చేస్తే మాత్రం ఆ హంగామా వేరే రేంజ్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: