తొలిప్రేమ సినిమా తర్వాత కానరాని నటి వాసుకి పరిస్థితి....!!

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చేసిన నటి వాసుకి అంటే ఇపుడు ఉన్నా ప్రేక్షకులకి పెద్దగా తెలీదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ లో పవన్ కల్యాణ్ చెల్లెలు బుజ్జి అంటే వెంటనే గుర్తుపడతారు.ఆ మూవీ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఎవర్‌ గ్రీన్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినది. ఆ తొలిప్రేమ మూవీలో అతని చెల్లెలిక్యారెక్టర్ తో అదరగొట్టింది వాసుకి.
ఆ మూవీలో పవన్‌- వాసుకీ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు ఆడియన్స్ ను చాలా బాగా  ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తే  మరికొన్ని సీన్లు మాత్రం బాగా కంటతడి పెట్టిస్తాయి. ఐతే వాటిలో ముఖ్యంగా క్లైమాక్స్ లో తనకి ఇష్టం లేకపోయినా తనని ప్రేమించే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది వాసుకీ. ఐతే అక్కడ  పవన్‌తో ఆమె చెప్పే సెంటిమెంట్‌ డైలాగులు అందరి హృదయాల్లో ఆ డైలాగ్స్ నిల్చిపోయాయి.అవి ఆడియన్సెని చాలా భావొద్వేగానికి గురి చేస్తాయి. ఆ విధంగా ప్రేక్షకుల మదిలోకి వెళ్లిపోయిన వాసుకీ వన్‌ ఫిల్మ్‌ వండర్‌లా ఒక్కసినిమా కే పరిమితమైంది. తొలిప్రేమ టైంలోనే ఆ మూవీ ఆర్ట్ డైరెక్టర్ పవన్‌ కల్యాణ్‌ మిత్రుడు, ఆనంద్ సాయితో ఆమెకు పరిచయం ఏర్పడి అది పెళ్ళికి దారి తీసింది. ఐతే పెళ్లి తర్వాత వాసుకి సినిమాలకి దూరం ఐపోయింది.
ప్రెసెంట్ వాసుకీ- ఆనంద్‌ సాయి జంటకు  ఇద్దరు పిల్లలున్నారు. అందులో ఒకరు కొడుకు మరియు ఒకరు కూతురు. ఆమె ప్రెసెంట్ ఐటీ దిగ్గజ కంపెనీ ఐనా గూగుల్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. మరియు వారి ఇద్దరి పిల్లల ఆలనాపానాలోనూ చాలా బిజీగా ఉంటోంది. ఆమె నెట్టింట్లో కూడా ఫుల్ జోష్ గా కనబడుతుంది.సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు తన పిల్లల ఫొటోలను షేర్‌ చేస్తోంది. అలాగే తాను ఎంజాయ్ చేసిన టూర్‌, వెకేషన్‌ పిక్స్ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేస్తుంటుంది. ఐతే ఆమె భర్త తొలి ప్రేమ లో తాజ్ మహల్ సెట్ దగ్గర నుంచి పవన్ సినిమాలైన తమ్ముడు, ఖుషీ, జల్సా ఇలా వరుసగా పవన్ సినిమాలకు ఆర్డ్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు ఆనంద్ సాయి. ఐతే  తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గారి టెంపుల్ నిర్మాణంలో కూడా ఆనంద్మెయిన్ పాత్ర పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: