తెలుగు హీరోలని మించిపోయిన షారుఖ్?

Purushottham Vinay
ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇప్పటి వరకు సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 10 తెలుగు చిత్రాలలో ఒకటిగా నిల్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా చాలా విజయవంతంగా థియేటర్స్ లో రన్ అవుతుంది.వరుస ప్లాపుల తరువాత చిరంజీవి ఈ సినిమాతో మంచి కం బ్యాక్ హిట్ ని అందుకున్నాడు.అలాగే చిరంజీవి లాగానే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ తో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు.సుమారు దశాబ్ద కాలం నుండి సరైన హిట్ లేక చాలా ఇబ్బంది పడుతున్న షారుఖ్ ఖాన్ రీసెంట్ గా 'పఠాన్' సినిమాతో ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని షేక్ చేసాడో అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఇప్పటి దాకా ఏకంగా 950 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది.


ఈ వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకోబోతున్న ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సూపర్ రికార్డ్స్ ని సెట్ చేసింది.ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సినిమా టాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యపడని రేర్ రికార్డు ని కూడా నెలకొల్పింది.అసలు విషయానికి వస్తే హైదరాబాద్ సిటీ లో ఈ సినిమా నేషనల్ ముల్టీప్లెక్సుల నుండి మొత్తం 20 రోజులకు గాను 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' సినిమాకి కూడా ఈ స్థాయి వసూళ్లు హైదరాబాద్ లో రాలేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇక్కడ పఠాన్ సినిమాకి దాదాపుగా 14 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది.అంటే కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కి హైదరాబాద్ లో మన టాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ క్రేజ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ పండితులు.ఇంకా ఈ సినిమాకి రన్ ఉండడం తో ఫుల్ రన్ లో కచ్చితంగా హైదరాబాద్ నుండి 20 కోట్ల రూపాయిల మార్కుకి చాలా ఈజీగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: