సెల్ఫీలో అందాలు ప్రదర్శిస్తున్న హెబ్బా పటేల్..!!

Divya
తెలుగులో మొదట అలా ఎలా సినిమా ద్వారా.. చిన్న పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హెబ్బా పటేలా. ఆ తర్వాత సుకుమార్ నిర్మాతగా తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ హెబ్బా పటేల్. న్యూ ఏజ్ లవ్ డ్రామా గా తెరకెక్కించడంతో ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఈమె నటనతో కుర్రకారులను సైతం మాయ చేసి యువత ఇమే అంద చందాలకు మంత్ర ముగ్ధులయ్యారని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ ఈమె కెరియర్ చాలా జెడ్ స్పీడుతో దూసుకుపోతుందని అందరూ భావించారు.కానీ అనుకోకుండా ఒక్కసారిగా ఈమె గ్రాఫ్ పడిపోయింది.
దీంతో పలు సినిమాలలో టైప్-2 హీరోయిన్ గా కూడా నటించింది. వరుణ్ తేజ్ కి జంటగా నటించిన మిస్టర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ ఒకసారిగా డౌన్ అయింది. ఈ క్రమంలోనే హెబ్బా పటేల్ బరువు పెరిగి బాడీ షేప్ అవుట్ కూడా మారిపోవడంతో పలు చిత్రాలను స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది. ఇక గ్లామర్ ఒలకపోయడంలో మాత్రం ఇతర హీరోయిన్లకు పోటీగానే ఉంటుంది హెబ్బా పటేల్. అడపాదప ఆఫర్లు వస్తున్నప్పటికీ ఈమెకు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ఇక ఈ మధ్యనే ఓటీటి లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో ఈమె కెరియర్ ఒకసారిగా మలుపు తిరుగుతోందని చెప్పవచ్చు. చిన్న సినిమాలు చేసుకుంటూ కెరియర్ పరంగా ముందుకు దూసుకుపోతోంది. మరొకవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో తరచుగా బోల్డ్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. హెబ్బా పటేల్ గ్లామర్ ఫోటోలు సైతం ఇమే అంద చందాలను పెంచేలా కనిపిస్తూ ఉన్నాయి.. ఇక గతంలో ఒక హీరోతో లవ్ లో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: