ఇక అవతార్ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమాను సినీ ప్రియులెవరూ కూడా మరిచిపోలేరు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ ఒక కొత్త లోకాన్నే చూపించాడు. 2009 వ సంవత్సరంలో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్ 'అవతార్'కు సీక్వెల్గా వచ్చిన మూవీ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. ఈ సినిమాని క్రిస్మస్ సందర్భంగా 2022 డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.ఈ సినిమా ఇండియాలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ప్రజల నుంచి మంచి ఆదరణ పొందింది.ఇక ఇండియాలో దాదాపుగా అన్ని ప్రధాన భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. తెలుగు వర్షన్‌కు ప్రముఖ తెలుగు యువ దర్శకుడు ఇంకా నటుడు అయిన అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. దీంతో సినిమాపై మరింత క్రేజ్ అనేది పెరిగింది. ఇక ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. అవతార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టింది..
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్‌ను చూస్తే.. నైజాంలో 31.46 కోట్లు, సీడెడ్ 7.01 కోట్లు, ఉత్తరాంధ్ర 8.13 కోట్లు, ఈస్ట్+ వెస్ట్ 3.68 కోట్లు, కృష్ణా +గుంటూరు 7.11 కోట్లు, నెల్లూరు 3.35 కోట్లు, మొత్తంగా భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో 60.74 కోట్ల షేర్ వసూలు అయ్యిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.60 రోజులు పూర్తి చేసుకున్నా కూడా హైదరాబాద్ లో ఈ సినిమాకి ఇంకా హౌస్ ఫుల్స్ పడటం విశేషం. ఇక ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా...మొత్తం రూ.5.25 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో అవతార్ 2 సినిమాకి దాదాపుగా 55.49 కోట్ల లాభాలు వచ్చాయి. ఇంకా అంతేకాదు డబ్బింగ్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రెండు బిలియన్ డాలర్స్‌కు (2.174 billion ) పైగా వసూళ్లను సాధించి వావ్ అనిపించింది..