'రుద్రుడు'మూవీలో కీలక పాత్రలో కనబడునున్న ఆ స్టార్....!!

murali krishna
ఇటు తెలుగు మరియు అటు తమిళ్ ఇండస్ట్రీ లో హార్రర్ మూవీ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఐతే రాఘవ లారెన్స్ హీరో గా కతిరేసన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ 'రుద్రుడు' రిలీజ్ కు సిద్ధమౌతోంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ మూవీ ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు.దీనికి పెట్టిన 'ఈవిల్ ఈజ్ నా బోర్న్ ,ఇట్ ఈజ్ క్రియేటడ్' అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్త లుక్ తో కనబడబోతున్నాడు . ఇప్పటికే విడుదలైన రుద్రుడు టీజర్ కు ఒక రేంజ్ లో  రెస్పాన్స్ వచ్చింది.
ఐతే దీంట్లో భాగంగానే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర మేకర్స్ రుద్రుడు ఫస్ట్ సింగల్ ''ప్రాణాన పాటలే పాడుతుంది' అనే సాంగ్ ను ఈ రోజు విడుదల చేశారు. వీర తిరుమగన్ చిత్రంలో''పాడాద పాటెలం' క్లాసిక్ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేసి ట్రెండీ, ఫుట్ ట్యాపింగ్ గా షో చేశారు. ధరన్ కుమార్ ఈ సాంగ్ ని ఎక్స్ ట్రార్డినరీగా రిక్రియేట్ చేయగా.. రాకేందు మౌళి ఈ సాంగ్ కు ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో లారెన్స్ డ్యాన్స్ మూవ్స్ మెస్మరైజ్ చేశాయి.
ఈ మూవీ లో శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో చేస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా చేస్తుంది.ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.
ఐతే ఈ మూవీ రుద్రుడు ఏప్రిల్ నెలలో  ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
ఒకప్పుడు లారెన్స్ చేసిన హార్రర్ మూవీస్ చాలా వరకు మంచి హిట్ అందుకున్నాయి అలాగే ఇది కూడా తన స్టార్ డం ను ఒక రేంజ్ కి తీసుకెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: