ఫస్ట్ టైం ఎన్టీఆర్ విదేశాలకు వెళ్ళింది ఎపుడో తెలుసా....??

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పరాయి దేశం పై ఫస్ట్ టైం షూటింగ్ జరుపుకున్న మొట్ట మొదటి తెలుగు చిత్రం సాహసవంతుడు.ఈ మూవీ లో ఎన్టీఆర్ హీరోగా చేయగా వాణిశ్రీ హీరోయిన్ గా చేసింది.దీనికి నిర్మాత పనిచేసిన వ్యక్తి విద్యాసాగర్.ఆయన అప్పట్లో  ఏం కామ్ చదివాడు మరియు మూవీస్ అంటే ఆయనకి చాలా ఆసక్తి.ఐతే అప్పట్లో ఆయనకు ఎన్టీఆర్ తో మూవీ చేయాలనే  కోరిక ఉండేది.
అప్పటిదాకా ఏ సినిమా కూడా విదేశాల్లో తీయలేదు అపుడు ఆయన ఎన్టీఆర్ తో ఫస్ట్ టైం షూటింగ్ విదేశాల్లో చేయాలి అనుకున్నారు.విద్యాసాగర్ గారి ఉత్సాహాన్ని అబ్సర్వ్ చేసిన ఎన్టీఆర్ తన డేట్స్ ఆయనకి ఇచ్చి ప్రోత్సహించారు.ఐతే సాహసవంతుడు మూవీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా ఏరియాల్లో చేసారు.ఐతే ఆ టైం లో నేపాల్ నేపథ్యము కలిగిన స్టోరీ నిఆయన సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి.
ఐతే ఆ టైములో ఖాట్మండుకి చెన్నై నుండి డైరెక్ట్ విమానం లేదు కలకత్తా వెళ్లి అక్కడ ఇంకొక విమానం ఎక్కాలి అంటే ఐదు గంటల జర్నీ.ఖాట్మండు పరిసర ఏరియాస్ లో టెన్ డేస్ కీలక సన్నివేశాలు, కరాటే ఫైట్, రెండు సాంగ్స్ తీశారు.ఐతే ఎన్టీఆర్ కూడా విదేశాలకు వెళ్లడం అదే మొదటిసారి.
ఐతే ఆ దేశం సంప్రదాయం ప్రకారం అక్కడ గవర్నమెంట్ ఏ విమానం కొన్నా కూడా నేపాల్ రాజు పూజ చేసిన తర్వాత ఆయన జాతికి అంకితం ఇస్తారు.కానీ పూజ కు ముందే ఎన్టీఆర్ ఎక్కే విమాన సీన్స్ చిత్రీకరించాల్సి రావడం తో పూజ కూడా జరగకుండానే నేపాల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మూవీ కోసం విమానాన్ని ఇచ్చారు.ఐతే ఈ మూవీ నిర్మాత విద్యాసాగర్ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి.ఎందుకంటే ఈ మూవీ చిత్రికరణ జరిగే టైం లో ఆయన ప్రయాణిస్తున్న కారుకి ఘోర ప్రమాదం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: