టీజర్ తోనే అల్లకల్లోలం సృష్టించిన రానా నాయుడు..!

Divya
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ బడా నిర్మాత దివంగత రామానాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ తో పాటు ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు దగ్గుబాటి నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా.. చిన్న కుమారుడు దగ్గుబాటి వెంకటేష్ కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఒకవైపు వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ విక్టరీ వెంకటేష్ గా దూసుకుపోతుంటే.. మరొకవైపు సురేష్ బాబు కూడా చిన్న కథలకు ప్రాధాన్యత ఇస్తూ నష్టాలకు పోకుండా సక్సెస్ అవుతున్నాడు.. ఇక ఈ క్రమంలోనే  వీరి వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఇప్పటికే సురేష్ బాబు కొడుకులు రానా,  అభిరామ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా కుటుంబాల వ్యక్తులు వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతుంటే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఒక్క కాంబినేషన్ మూవీ కూడా రాలేదు.  దీంతో అభిమానుల కోరిక మేరకు రానా,  వెంకటేష్ కలసి ఒక వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే మొదటిసారి రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ నుంచి ఒక టీజర్ను విడుదల చేయగా ఆద్యంతం టీజర్ తోనే అల్లకల్లోలం సృష్టిస్తుందని చెప్పవచ్చు. టీజర్ లో.."  మీ సహాయం గురించి నేను చాలా విన్నాను ఏ సెలబ్రిటీ అయినా సరే కష్టాల్లో ఉన్నప్పుడల్లా మీరు వారి కోసం పనిచేస్తారు" అంటూ చెప్పే డైలాగ్ రానా ను టైటిల్ ఫిక్సర్ గా పరిచయం చేస్తోంది. త్వరలోనే ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా నెట్ ఫ్లెక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: