నాని దసరా మూవీ నుంచి అప్డేట్ రివీల్ చేసిన కీర్తి సురేష్..!

Divya
మహానటిగా తనకంటూ ప్రత్యేకమైన బిరుదును సొంతం చేసుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట్లో ప్రముఖ నటి మేనక వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె తన అందంతో ప్రేక్షకులను మెప్పించగలిగింది. కానీ కథపరంగా అలరించలేకపోయారు. దాంతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సావిత్రి బయోపిక్ మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాంతో ఇదే బిరుదు ఆమెను వరించింది అని చెప్పవచ్చు.
సావిత్రి , సౌందర్య లాగా ఎక్కువగా సాంప్రదాయబద్ధంగా కనిపించి గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసింది. ఆ తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.  సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ వొలక పోస్తే తప్ప అవకాశాలు రావని లేటుగా తెలుసుకున్నట్టుంది ఈ క్రమంలోని ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో తనలో ఉన్న మరొక గ్లామర్ యాంగిల్ ని చూపించి యువతను తన వైపు తిప్పుకుంది. పలు  లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను అలరించలేక పోయింది ఇప్పుడు నాని దసరా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ క్రమంలోని ఈ సినిమా నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ రివీల్ చేసింది కీర్తి సురేష్.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న దసరా సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. నాని, కీర్తి సురేష్ , సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మార్చి 30వ తేదీన తెలుగు,తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ  భాషలలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.ఈ క్రమంలో నే సినిమా పై బజ్ పెంచడానికి కీర్తి సురేష్ ఈ సినిమా ప్యూర్ లవ్ ట్రాక్ నేపథ్యంలో తెరకెక్కబోతోందని సినిమాకి ఈ లవ్ ట్రాక్ ప్రధాన హైలైట్ గా నిలవబోతోంది అని కీర్తి సురేష్ చెప్పడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమా కీర్తి సురేష్ కు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: