ఎన్టీఆర్ 30లో ఆ ఇద్దరు క్రేజీ నటులు..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస మూవీలకు కమిట్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా చాలా రోజుల క్రితమే ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీలో నటించడానికి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా , రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ లో జాన్వి కపూర్ , ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అయింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఇప్పటికే జాన్వి ను ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఒక క్రేజీ నటుడు ... కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి మరో క్రేజీ నటుడు నటించబోతున్నట్లు ... ఆ ఇద్దరు మరెవరో కాదు అని ... బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ఉన్న సైఫ్ అలీఖాన్ ... కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న చియాన్ విక్రమ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయినట్లు అయితే ఈ సినిమాకు తెలుగు తో పాటు బాలీవుడ్ ... కోలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: