ఆ పని చేయాలంటే షివరింగ్ వస్తుంది.. షాకింగ్ విషయం చెప్పిన కళ్యాణ్ రామ్?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియాలో బుల్లితెరపై ఎక్కడ చూసినా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చేస్తున్న సందడి ఎక్కువగా కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్  సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడమే.. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతూ ఉన్నాడు ఈ నందమూరి హీరో. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన  అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే మొదటిసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.

 మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ తన కెరియర్ గురించి.. పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక తన సినిమాలలో డాన్సులు చేయడం గురించి ఇటీవల ఒక షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు కళ్యాణ్ రామ్.

 మొదటి నుంచి కూడా నాకు డాన్సులు అంటే ఎంతో భయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక డాన్సులు చేస్తున్నప్పుడు ఒక రకమైన శివరింగ్  వచ్చేస్తుంది అంటూ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసాడు. డాన్సులు చేయాల్సి ఉందంటే చాలు రెండు మూడు రోజులపాటు టెన్షన్ తో నిద్ర పట్టదు రిహార్సల్స్ అన్న షూటింగ్లో వన్స్ మోర్ అనే మాట వినిపించిన అంతే టెన్షన్ గా ఉంటుంది. ఇక ఇదే టెన్షన్ ఇక ఇప్పుడు అమిగోస్ సినిమాకు కూడా పడాల్సి వచ్చింది అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. కాగా మనిషిని పోలిన మనుషులు ఎదురైతే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: