"శ్రీదేవి శోభన్" బాబు మూవీ నుండి మూడవ పాట విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరోలలో సంతోష్ శోభన్ ఒకరు. ఈ మధ్య కాలంలో సంతోష్ వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన కళ్యాణం కమనీయం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు మూవీ లు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో శ్రీదేవి శోభన్ బాబు అనే మూవీ లో హీరో గా నటించాడు.

ప్రశాంత్ కుమార్ దిమ్మల రచన మరియు దర్శకత్వం వహించిన ఈ మూవీ ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇది చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నటనా రంగ ప్రవేశం సినిమా. సంతోష్ శోబన్ మరియు సుస్మిత జంటగా నటించిన ఈ మూవీ లో గౌరీ జి కిషన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కి సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఫిబ్రవరి 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.
 

tఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం రెండు పాటలను కూడా విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మూడవ పాట విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ నుండి టామ్ అండ్ జెర్రీ అనే మూడవ పాటను ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ పాట ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: