పఠాన్ సినిమాపై రాజ్యసభలో పొగడ్తల వర్షం?

Purushottham Vinay
ఇక కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి  ఇప్పటి వరకు ఏకంగా 800 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఈ మూవీ నిలిచింది. షారుఖ్ ఖాన్ నుంచి చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా రావడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి విపరీతంగా  చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షేర్ పరంగా చూసుకుంటే 500 కోట్లదాకా వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా భారీగా నెగిటివ్ ప్రచారం అనేది నడిచింది. ఒక వర్గం ప్రజలు అయితే ఏకంగా ఈ సినిమాపై బ్యాన్ పఠాన్ అంటూ నెగటివ్ ప్రచారం చేశారు. అయితే నెగిటివ్ ప్రచారాన్ని దాటుకుంటూ ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా గురించి రాజ్యసభలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీ డిరాక్ ఓ బ్రియన్ ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది.బాలీవుడ్ లో రిలీజ్ అయిన పఠాన్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఏకంగా 422.75 కోట్లు కలెక్ట్ చేసిందని ఆయన తెలిపారు.


ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు ఈ సినిమా మంచి సందేశాన్ని కూడా ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రపంచానికి ఇండియా బిగ్గెస్ట్ గ్లోబల్ అంబాసిడర్ గా ఈ సినిమా రిప్రజెంట్ చేసింది అని చెప్పారు. ఇలాంటి గొప్ప సినిమాలో భాగస్వామ్యం అయిన షారుఖ్, దీపికా పదుకునే,జాన్ అబ్రహంకి అభినందనలు తెలిపారు. వీరందరూ కూడా చాలా అద్బుతమైన నటనతో అలరించారు అని కొనియాడారు. అలాగే ఇంత అద్బుతమైన సినిమాని ఇండియన్ ప్రేక్షకులకి అందించిన డైరెక్టర్ సిద్ధార్ద్ ఆనంద్ ని కచ్చితంగా అభినందించాల్సిందే అన్నారు. ఈ సినిమాని మీరందరూ ద్వేషిస్తే వారు మన కోసం అద్బుతమైన సినిమాని అందించి ఇండియా గొప్పతనాన్ని చెప్పారని బీజేపీని ఉద్దేశిస్తూ ఓ బ్రియాన్ స్పీచ్ రాజ్యసభలో  ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: