డిజాస్టర్లుగా మిగిలిపోయిన బుట్టబొమ్మ, మైఖేల్?

Purushottham Vinay
రీసెంట్ గా థియేటర్లలో మూడు కాన్సెప్టు ఓరియెంటెండ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమా మైఖేల్, సుహాస్ రైటర్ పద్మభూషన్ ఇంకా అలాగే అనిక సురేంద్రన్, అర్జున్ దాస్,  సూర్య వశిష్ట కీలకపాత్రల్లో చేసిన బుట్టబొమ్మ.అయితే ఈ మూడు సినిమాల్లో సుహాస్ రైటర్ పద్మభూషన్ మాత్రమే హిట్ బొమ్మగా నిలిచింది.మిగిలిన రెండు సినిమాలు మాత్రం పూర్తిగా వాష్ ఔట్ అయిపోయాయి.ఇక ముందుగా సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా చిత్రం మైఖేల్. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ సినిమాగా ఈ సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మంచి పబ్లిసిటీతో వచ్చిన మైఖేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాతో సందీప్ కిషన్ కమ్ బ్యాక్ హిట్ కొడతాడని అందరూ ఆశించగా.. మొదటి ఆట నుంచే టాక్ ఘోరంగా ఉండటంతో ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది .


సందీప్ కిషన్ మైఖేల్ సినిమాలో గౌతమ్ మీనన్, అనసూయ, వరుణ్ సందేశ్ లతో పాటు విజయ్ సేతుపతి ఇంకా అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ వంటి క్రేజీ నటీనటులు నటించారు. మైఖేల్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్ అయింది. కానీ ఏ ఒక్క చోటా సినిమాకి మంచి టాక్ రాలేదు.అలాగే బుట్టబొమ్మ సినిమాకి కూడా అదే పరాభవం ఎదురయింది. బుట్టబొమ్మ సినిమా 2020 వ సంవత్సరంలో విడుదలైన మలయాళ హిట్ కప్పెలా సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. పరస్పరం ఎప్పుడూ కలవని ఒక ఆటోడ్రైవర్ ఇంకా పల్లెటూరి అమ్మాయికి మధ్య జరిగే ఫోన్ కాల్ రొమాన్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. వారి జీవితం లోకి మరో వ్యక్తి ప్రవేశించినపుడు ఎదురయ్యే సంఘటనల సమాహారం ఈ సినిమా కథ. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ సినిమాస్ పతాకాలపై నిర్మించిన సినిమా 'బుట్టబొమ్మ'. కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టీ రమేష్ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యి వాష్ ఔట్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: