రాజశేఖర్ -శ్రీలీల మధ్య ఉన్న రిలేషన్ అదేనా.....!!

murali krishna
మన తెలుగు చిత్ర పరిశ్రమ లో  సీనియర్ హీరో గా మంచి పేరు పొందిన నటుడు రాజశేఖర్ గూర్చి ప్రత్యేకమైన పరిచయం అనేది అవసరం లేదు.ఆయన ఒకప్పుడు వరుస విజయాల తో మూవీ చేస్తూ అప్పట్లో చిరు మరియు బాలయ్య బాబు కి కొంత కాలం గట్టి పోటీ ఇచ్చారు.అలాంటి ఆయన గత కొంత కాలంగా మూవీస్ కి దూరం గా ఉంటూ వచ్చారు.
ఐతే ఇటీవల ఆయన తక్కువగా సినిమాలు చేస్తూ ఆయన కూతుర్లు ఐనా శివాని శివాత్మికను కూడా చిత్ర పరిశ్రమ కు పరిచయం చేసారు. ఐతే వాళ్లిద్దరూ మాత్రం చెప్పుకునే స్థాయి కి ఏదగలేక పోతున్నారు.
ఇకపోతే ఇపుడిపుడే ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించు కుంటున్న హీరోయిన్ శ్రీలీల కు అలాగే రాజశేఖర్ కి మంచి రిలేషన్ కూడా ఉంది. రాజశేఖర్ గారు వృత్తి రీత్యా వైద్యుడు.
లేటెస్ట్ గా ఆమె మాస్ మహా రాజ్ రవితేజ  హీరో గా చేసిన ధమాకా మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందు కున్నారు.ఐతే మరీ ఈ బ్యూటీ కి  రాజ శేఖర్ గారికి మధ్య ఉన్న రిలేషన్ విషయాని కి వస్తే హీరోయిన్ శ్రీ లీల నటిగా చిత్ర పరిశ్రమ లో ఉన్నప్పుడు ఆమె కూడా  వైద్య విద్యను అభ్యసిస్తుంది.ఈ సంవత్సరం లో ఈమె కూడా డాక్టర్ పట్టా స్వీకరించ బోతుంది.ఐతే రాజ శేఖర్ లాగా ఆమె కూడా వైద్య విద్యను చదివి చిత్ర పరిశ్రమ లో రానిస్తున్న నటుల్లో ఒకరిగా చెప్పవచ్చు.
అవిధంగా రాజ శేఖర్ లాగా ఆమె కూడా డాక్టర్ చదువు చదివి పరిశ్రమ లో హీరోయిన్ గా ఉండడమే వీరి మధ్య ఉన్న సంబంధ. ఐతే శ్రీలీల మరియు రాజశేఖర్ గారి కాంబినేషన్ లో సినిమా వస్తే అది కూడా డాక్టర్ రోల్స్ తో మూవీ చేస్తే చూడాలని రాజశేఖర్ గారి అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: