కిక్ సినిమాను వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే ఎవరైన పట్టించుకుంటారు లేకపోతే ఎవ్వరు కూడా వాళ్ళని అస్సలు పట్టించుకోరు అనే సంగతి అందరి తెలిసిందే.అందుకే అందరు ఇక్కడ సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది అని కూడా అంటూ ఉంటారు.అలా సక్సెస్ లేకపోవడం వల్ల కొందరు హీరోలు కొందరు డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వకపోవడం మళ్లీ వాళ్ళు వేరే హీరోలతో సక్సెస్ కొట్టాక మనం ఆ సినిమా చేసి ఉంటె బాగుండేది అని అనుకున్న స్టార్ హీరోలు వున్నారు.
అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ని పక్కన పెట్టి ఆయన తీసిన కిక్ సినిమా సూపర్ హిట్ సాధించాక బాధపడ్డాడు ఆ హీరో.డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన మొదటి సినిమా అయినా అతనొక్కడే సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు ఈ సినిమాలో ఒక కొత్త రకమైన మేకింగ్ ని అతను చూపించాడు.సురేందర్ రెడ్డి ఈ సినిమా తర్వాత తను ఎన్టీయార్ తో చేసిన అశోక్ సినిమా చేసిన ఆ సినిమా ప్లాప్ అయింది దాని తర్వాత మహేష్ బాబు తో చేసిన అతిధి సినిమా కూడా దారుణంగా ప్లాప్ అయింది.

దాంతో ఒక మంచి సినిమా చేయాలి అని సురేందర్ రెడ్డి అనుకుంటున్నప్పుడు రైటర్ వక్కంతం వంశీ చెప్పిన కిక్ కథ నచ్చి ఎన్టీయార్ అయితే ఈ సినిమాకి కరెక్ట్ గా సూట్ అవుతాడు అనుకొని సురేందర్ రెడ్డి ఎన్టీయార్ కి కథ చెబితే కథ ఎన్టీయార్ కి బాగా నచ్చింది కానీ సురేందర్ రెడ్డి తీసిన ముందు రెండు సినిమాలు ప్లాప్ అవడం వల్ల అందులో ఒకటి ఎన్టీయార్ సినిమా అయి ఉండడం కూడా ఎన్టీయార్ ఈ సినిమా ఒప్పుకోకపోవడానికి ఒక కారణం అనే తెలుస్తుంది.దాంతో సురేందర్ రెడ్డి రవితేజతో కిక్ సినిమా తీసి భారీ హిట్ కొట్టాడు.ఈ సినిమా చూసిన ఎన్టీయార్ మంచి హిట్ సినిమా వదులుకున్నానే అని బాధపడి సురేందర్ రెడ్డి తో ఊసరవెల్లి సినిమా తీసాడు కానీ ఎన్టీఆర్ అదృష్టం బాగోలేదేమో ఆ సినిమా ప్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: