ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పరుశురామ్ పెట్ల కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన గీత గోవిందం అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి  ప్రేక్షకుల అంచనాలకు మించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా దర్శకుడు పరశురామ్ కు హీరో విజయ్ కు హీరోయిన్ రష్మిక కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది.

అలా గీత గోవిందం మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పరుశురామ్ కు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో మూవీ చేసే అవకాశం లభించింది. అందులో భాగంగా ఈ దర్శకుడు మహేష్ తో సర్కారు వారి పాట అనే మూవీ కి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తన కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన గీత గోవిందం మూవీ కి పరుశురామ్ సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు ... అందులో విజయ్ దేవరకొండ హీరో గా నటించనుండగా దిల్ రాజు ఆ క్రేజీ మూవీ ని నిర్మించబోతున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
 

ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఒక మూవీ ని నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఫోటో ను కూడా విడుదల చేశాడు. కాకపోతే ఆ సినిమా గీత గోవిందం మూవీ కి సీక్వెల్ గా రూపొందబోతుందా  లేదా కొత్త కథతో రూపంతో పోతుందా అనేది మాత్రం ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: